విశాఖకు ద్రోణం లేని లోటు తీరనిది..గంట్ల


Ens Balu
3
Visakhapatnam
2020-10-05 12:55:45

విశాఖ మాజీ ఎమ్మెల్యే, వి.ఎం.అర్.డి.ఎ  పూర్వపు చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి ఉత్తరాంధ్ర కు తీరని లోటు గా జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అభివర్ణించారు. సోమవారం ద్రోణంరాజు పార్థివ దేహేన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాచలం ప్రాంతం కు చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రి బాటలో ముందుకు సాగేవారన్నారు. రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా అందరితో కలిసి   మెలిసి ప్రజలకు సేవచేసే ద్రోణంరాజు మృతి ఎంతో మందిని కలచి వేసిందన్నారు. విశాఖ ప్రజా సమస్యలు పరిస్కారమే లక్ష్యం గా ముందుకు సాగే మహోన్నత వ్యక్తి ని కోల్పోవడం చాలా విచారకరమన్నారు. ప్రధానంగా జర్నలిస్ట్ లు అంటే ఆయన కు  ఎంతో మక్కువ అన్నారు.   ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా ముందు ద్రోణంరాజు వచ్చి ఆ కార్యక్రమం నడిపించే వారని గుర్తుచేశారు. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసారు.భవిష్యత్తు లో వారి కుటుంబం కి ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని తాను కోరుకుంటున్నట్టు గంట్ల చెప్పారు.