వీరవేంకట సత్యదేవ ప్రసవ వేదన తప్పించలేవా..?
Ens Balu
1
Annavaram
2020-07-09 15:32:49
అన్నవరంలో ప్రసవ వేదనను తప్పించాలంటూ గర్భిణీలు సత్య దేవుడికి ముక్కోటి మొక్కులు మొక్కతున్నారు. కారణం అన్నవ రంలో గర్భిణిలకు డెలివరీలు చేయడానికి ఆసుపత్రి లేకపోవడమే. దేవస్థానం ఆసుపత్రి ఉన్నా అక్కడ ప్రాధమిక వైద్యం తప్పా మరే మీ అందటం లేదు. దీంతో గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలం టే ఇటు తునిగానీ, అటు శంఖవరంగానీ, లేదంటే కాకినాడ జిజిహె చ్ కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో అన్నవరం ప్రాంతంలో గర్భిణీలు ప్రసవాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివా రి దేవస్థాన ఆసుపత్రిలో అయినా ప్రసవాలకు వీలుగా కనీసం 20 పడకల ఆసుపత్రిగా నైనా మార్పుచేయాలని కోరుతున్నారు. ఈ ప్రాతంలో గర్భిణీల ప్రసవ వేధన అంశం యాంటినెటల్ డే సంద ర్భంగా ఒకేసారి శంఖవరం పీహెచ్సీలో వైద్యపరీక్షల కోసం వచ్చిన గర్భిణిల పరిస్తితికి అద్దం పట్టింది. దీనిపై అధికారులు స్పందించా ల్సివుంది.