బ్యాంకులు లక్ష్యాలను పూర్తిచేయాలి..


Ens Balu
2
కలెక్టరేట్
2020-10-05 18:58:55

ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను త్వరితగతిన గుర్తించి లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2020-21 సంవత్సరానికి వార్షిక ఋణ ప్రణాళికలోని జూన్ వరకు సాధించిన ప్రగతిపై జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సోమవారం ఆయన సమీక్షించారు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు విక్రయించడం జరుగుతుందనారు.  వచ్చే రబీ సీజన్ కు సంబంధించి ప్రణాళికను పక్కాగా తయారు చేయాలని జెడిని ఆదేశించారు.  పంటలకే కాకుండా పశు సంవర్థక శాఖ, మత్య్సశాఖ, తదితర శాఖలకు ఋణాలు మంజూరు చేయాలన్నారు.  ప్రాధాన్యత గల వ్యవసాయం, ఎంఎస్ఎంఇల పురోగతిని బ్యాంకు అధికారులతో సమీక్షించారు. జగనన్నతోడు, వై.యస్.ఆర్.భీమా, వై.యస్.ఆర్. చేయూత, వై.యస్.ఆర్. ఆసరా, తదితర వాటిపై సమీక్షించారు.  సచివాలయాల ద్వారా  అర్హత గల లబ్దిదారులను గుర్తించి లక్ష్యాలను శత శాతం పూర్తిచేయాలన్నారు. మెప్మా, యుసిడి ప్రాజెక్టు అధికారులు వార్డులలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు. ఎస్.సి., బి.సి., మైనారిటీ కార్పొరేషన్ ల ప్రగతిపైన సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పి.యం. స్వనిధి, ముద్ర, పియంఇజిపి, తదితర పథకాల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఇండస్ట్రియల్ కు సంబంధించి జిల్లా మేనేజర్ రామలింగరాజు కలెక్టర్ కు వివరించగా లక్ష్యాలను తరితగతిన పూర్తి చేయాలన్నారు.  ముందుగా ఆమోదించబడిన వార్షిక ఋణ ప్రణాళిక, నాబార్డు వారి వ్యవసాయానికి సంబంధించి యూనిట్ కాస్ట్ పుస్తకాలను ఆవిష్కరించారు.  శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు-1,2,3  ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, గోవిందరావు,   డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, ఎస్.సి., బి.సి. కార్పొరేషన్ ఇడిలు ఎం.ఎస్. సోభారాణి, పెంటోజిరావు, మైనార్టీ కార్పొరేషన్ ఇడి, ఎల్డిఎం  శ్రీనాధ్, ఎఎల్డిఎం మూర్తి, నాబార్డు ఎజిఎం శ్రీనివాసరావు, యుసిడి పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి సరోజని, ఆయా బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.