మనీషా అత్యాచార నిందితులను ఉరితీయాలి..


Ens Balu
2
Srikakulam
2020-10-05 19:34:55

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళ మనీషా పై అత్యాచారం చేసి ఆమె మృతికి కారకులైన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్  ఆద్వర్యంలో సోమవారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ గ్రామములో దళిత కుటుంబానికి చెందిన 19 యేళ్ళ మనీషా పై అత్యాచారం చేసిన యువకులను ఉరితీయాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.15 రోజుల క్రిందట మనీషాపై పాశవికంగా దుర్మార్గులు అత్యాచారాని పాల్పడగా  సరైన వైద్య సదుపాయం అందని కారణంగా ఆమె మృతి చెందిన తీరు విచారకమరన్నారు. బాధితురాలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్ప చెప్పకుండా అర్థరాత్రి ఊరి చివరన  దహన క్రియలు నిర్వహించారన్నారు.  ఇది పోలీసులకు ప్రభుత్వానికి మాయని మచ్చ అన్నారు.  దళితులపై ఇటీవల కాలంలో అత్యాచారాలు,దాడులు పెరిగిపోతున్నాయని వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులపై దాడులు ఆగాలంటే దళితులకే రాజ్యాధికారం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐమ్ జోనల్ ఇన్ చార్జి మాతా శామ్యూల్ సుధాకర్ ,జిల్లా కార్యదర్శి తాళాడ రవీంద్ర,యువసైనిక్ కన్వీనర్ కళ్లేపల్లి హరికృష్ణ,కార్యదర్శి పెయ్యల చంటి, శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ చార్జి సత్తిబాబు,టౌన్ యువ సైనిక్ అధ్యక్షులు పాగోటి ప్రసాద్ ,శ్రీకాకుళం డివిజన్ ఇన్ చార్జి దువ్వాన అప్పలసూరి ,ఎఐమ్ నాయకులు ప్రదీప్ ,శంకర్ ,చిరంజీవి,మజ్జి గౌతమ్ ,పంకు మురళీ,పంకు మహేష్ ,మణి,పండు ,విజయ్ కృష్ణ,భాగ్యరాజ్ ,గణేష్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.