అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు..


Ens Balu
6
కలెక్టరేట్
2020-10-06 15:40:04

శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కరోనా వ్యాధిగ్రస్థులు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని,  ప్రభుత్వ విధి విధానాలు అనుసరించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అన్నారు. ఏ హాస్పిటల్  ఎంత వసూలు చేస్తున్నారో  వాటి వివరాలు కొంత మేర  ఉన్నాయని పేర్కొంటూ ఇకముందు ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి వైద్యం చెయ్యాలని ఏమైనా ఇబ్బందులుంటే సరి చేస్తానని చెప్పారు.  ఈ సమావేశంలో  యూనిక్ హాస్పిటల్  ప్రతినిధి డాక్టర్ చింతాడ భాస్కరరావు మాట్లాడుతూ కొన్నిసార్లు కోవిడ్ వ్యాధిగ్రస్తులు జాయిన్ అయినపుడు ఎంత ఖర్చు అయినా పర్వలేదు ,ఏ టెస్టులు చేసినా పర్వలేదు అని జాయిన్ అయ్యి బిల్లు చెల్లింపు సమయంలో  రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వివిధ వర్గాల జ్యోక్యం కూడా జరుగుతుందని, మేము  వీటన్నిటి వలన  ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం తరపున అన్నారు. ఈ సమావేశంలో డి ఎం హెచ్ ఓ చంద్రానాయక్, ఆడిషనల్  డి ఎం హెచ్ ఓ బగాది జగన్నాథ రావు,  డాక్టర్ కొయ్యాన అప్పారావు,  ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.