నాడు-నేడు పనులు సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
3
గార
2020-10-06 18:26:38

నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా, గార మండలం వాడాడ, సతివాడ, గారలలో మంగళ వారం నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డిజిటల్ అసిస్టెంట్లతో పనులు ప్రగతిపై సమీక్షించారు. నవంబర్ 2 నుండి పాఠశాలలు తెరువనున్న నేపథ్యంలో అక్టోబరు నెలాఖరు నాటికి  నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. నాడు-నేడు, రైతు భరోసా, హెల్త్ కేర్ కేంద్రాల పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో  మరుగు దొడ్ల నిర్మాణ పనులు సక్రమంగా ఉండాలని, నిరంతర నీటి సరఫరాలో లోపాలు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. పనులకు  సంబంధించి బిల్లులు ఈ నెల 15 నాటికి చెల్లింపులు జరుపుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ వివరించారు. నాడు నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదకరంగా మారుతాయని, చిన్నారులు ఆసక్తితో బడికి రావాలని పేర్కొన్నారు. మన బడి అని గర్వంగా భావించాలని అన్నారు. ఆధనీకరణ పనుల్లో నాణ్యతలో ఎట్టి పరిస్ధితుల్లో రాజీ లేకుండా పనిచేయాలని స్పష్టం చేసారు.  ఈ కార్యక్రమంల సహాయ కలెక్టర్ ఎం.నవీన్, మండల ప్రత్యేక అధికారి జి.రాజారావు, మండలస్థాయి అధికారులు ఉన్నారు.