రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
3
Polaki
2020-10-06 18:34:10

రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలం మబగంలో రైతులకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా ర్యాలీస్ ఉత్పత్తి చేసిన క్రిమినాశిని మందులను ఉచితంగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు క్రిమినాశిని మందులను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా కోరమండల్ ఉత్పాదకాలైన వాడా మైనను, టాటా ర్యాలీ ఉత్పాదకాలు బెఫ్రిప్యూజన్ మందులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జెడి కె శ్రీధర్, ఉపసంచాలకులు రాబర్ట్ పాల్, ఏడి కె రవీంద్ర భారతి, ఏడి (సెరికల్చర్) పి.బాలకృష్ణారావు, మండల వ్యవసాయాధికారి కెసిహెచ్ వెంకటరావు, కోరమండల్ జిల్లా ప్రతినిధి కిషోర్ వర్మ, ప్రతినిధులు మోహన్, సత్యనారాయణ, టాటా ర్యాలీస్ ప్రతినిధి కృష్ణప్రసాద్, విఏఏ బి రోజారత్నం తదితరులు పాల్గొన్నారు.