రవితేజను స్పూర్తిగా తీసుకోవాలి..
Ens Balu
1
Srikakulam
2020-10-06 19:35:03
సవర రవితేజ స్ఫూర్తితో గిరిజన విద్యార్ధులు మంచి ర్యాంకులు సాధించాలని సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వై.టి.సి.లో ఐ.ఐ.టి. సూపర్ -60 విజయకేతనం పై పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పి.ఓ. మాట్లాడుతూ గిరిజన విద్యార్ధులకు ఐ.ఐ.టి, నిట్ వంటి కళాశాలలలో ప్రవేశం కల్పించటానికి. జిల్లా కలెక్టర్ జె.నివాస్, గత పి.ఓ సాయికాంత్ వర్మ, ఆగస్టు 3న ఐ.ఐ.టి. సూపర్ 60ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వై.టి.సి.లో వారికి మంచి శిక్షణ నివ్వడం జరుగుతున్నదని తెలిపారు. 55 మందికి కోచింగ్ అందించగా 33 మంది ప్రవేశ పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. జె.ఇ.ఇ. అడ్వాన్స్ డ్ లో ఐ.ఐ.టి. కి అయిదుగురు, జె.ఇ.ఇ. మెయిన్స్ లో నిట్, ఐ.ఐ.టిలలో ప్రవేశానికి 12 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. జె.ఇ.ఇ. ప్రిపరేటరీ ర్యాంకులో మరొక నలుగురు విద్యార్ధులున్నారని, తెలిపారు. సవర రవితేజ, ఐ.ఐ.టి-జెఇఇ లో 832 వర్యాంకు సాధించడం ఒక గర్వకారణమన్నారు. రవితేజ పేరును ఒక తరగతి గదికి నామకరణం చేస్తామని, తద్వారా మిగిలిన విద్యార్ధులకు స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు. మొదటి సారిగా 16 మంది విద్యార్ధులకు సీటు రావడం సంతోషదాయకమని గిరిజన విద్యార్ధులకు ఇది గర్వకారణమని అన్నారు. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది మరిన్ని మంచి ఫలితాలు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. టీచింగ్ స్టాఫ్, , కోర్స్ కో-ఆర్డినేటర్ లు మంచి కృషి చేసారన్నారు.
ఐ.ఐ.టి, సూపర్ 60 ఎ.ఓ. గున్ను రామ్మోహన్ రావు మాట్లాడుతూ, 5 నెలల కాలంలోనే మంచి ఫలితాలు సాధించడం జరిగిందని, నిబధ్ధతతో ఉపాధ్యాయుల బోధన, మంచి పట్టుదల, క్రమ శిక్షణతో విద్యార్ధులు చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కార్పోరేట్ కాలేజీలు సాధించని మంచి ర్యాంకులు గిరిజన విద్యార్ధులు సాధించడం చాలా సంతోషదాయ కమన్నారు. కరోనా సమయంలో విద్యార్ధులకు పి.ఓ., ల్యాప్ టాప్ లు అందించి, ఆన్ లైన్ ద్వారా శిక్షణ నిచ్చారన్నారు. రికార్డు స్థాయిలో ఫలితాలు రావడం గర్వ కారణమన్నారు. అనంతరం సవర రవితేజ, (ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ 832) మాట్లాడుతూ, తమకు టీచర్లు మంచి బోధన చేసారని, అన్నీ వివరంగా తెలిపేవారని చెప్పాడు. చాలా సంతోషంగా వుందన్నాడు. ఎన్.సునీల్ మాట్లాడుతూ, మంచి వాతావరణంలో బోధన, పెర్సనాలిటీ డెవలెప్ మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ తో మంచి కోచింగ్ అందించారని తెలిపాడు. ఎర్తా సింగ్ మాట్లాడుతూ, మంచి గైడెన్స్ ఇచ్చారని, న్యూ టెక్నిక్స్ తెలిపారని, చాలా సంతోషంగా వుందని తెలిపాడు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరక్టర్ మురళీ బాబు, ఫాకల్టీ సభ్యులు బి.కిరణ్, నళినీకాంత్ , విద్యార్ధులు పాల్గొన్నారు.