అక్కడ చెత్తవేస్తే భారీ ఫైన్..
Ens Balu
0
జీవిఎంసీ కార్యాలయం
2020-10-06 20:02:06
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని రోడ్డు మార్జిన్ లు, వీధుల్లో చెత్తవేయడాన్ని జీవిఎంసీ నిషేదించిందని కమిషనర్ డా.స్రిజన తెలియజేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు, చెత్తలు వేసేవారికి హెచ్చరికలు జారీచేశారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా.. భారీ జరీనామతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తులు భావన నిర్మాణ వ్యర్ధములు కానీ, చెత్తగానీ మీకు తెలిసిన ప్రాంతాల్లో పచేసినా తక్షణమే హెల్ప్ లైన్ నెంబర్ కు, టోల్ ఫ్రీ నెంబర్ కు 1800-42500009 తెలియజేయాలని కోరారు. విశాఖనగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు కమిషనర్ తెలియజేశారు. భవన యజమానులు నిర్మాణ వ్యర్థాల సేకరణ కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 8008182277 మరియు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా విశాఖ నగర పాలక సంస్థ నియమించిన ప్రోఎన్విరో సంస్థకు తెలియచేసి వ్యర్ధాలను తొలగించుకోవాలన్నారు. వారి సేవలు వినియోగించుకొని జివిఎంసికి సహకరించి “స్వచ్ఛ విశాఖ” పరిశుభ్రతకు మీ సంపూర్ణమైన తోడ్పాటును అందించవలసినదిగా కమిషనర్ కోరారు.