కనుల పండువగా సింహాద్రినాధుని గరుడసేవ..
Ens Balu
1
Simhachalam
2020-10-07 13:29:44
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బుధవారం గరుడసేవ వైభవంగా నిర్వహించారు. వేకకువ జామున సుప్రభాత సేవలతో సింహాద్రినా ధుడిని మేల్కొలిపి ఆరాధన పూర్తిచేశారు. అనంతరం స్వామివారిని గరుడవాహనంపై ఆశీనులను చేసి సేవ కార్యక్రమాన్ని కన్నులపండువగా జరిపించారు. ఒడిశాకు చెందిన వనమాలిక్ నాయకో దాస్ బృందం, అప్పన్న చందనోత్సవ కమిటీ సభ్యులు గంట్లశ్రీనుబాబు ఈ పూజల్లో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నుంచి ప్రజలను పూర్తిగా విముక్తి చేయాలని కోరుకున్నట్టు చెప్పారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆలయ ప్రధాన పురోహితులు కరి సీతారామాచార్యులు, చిన్నపూజలు నిర్వహించారు. ఏఈవో పులి రామారావు పర్యావేక్షణ లో కార్యక్రమం నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.