ఎన్టీఆర్ భారతరత్నకై తెలంగాణలోనూ ఉద్యమం..
Ens Balu
1
Visakhapatnam
2020-10-07 15:58:37
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి భారతరత్న ప్రకటించాలని డా.ఎన్టీఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి చేసిన డిమాండ్ కి తెలంగాణలోనూ మంచి స్పందన వస్తోందన్నారు. ఈ సందర్భంగా స్వామి బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ అభిమానుల ఐక్యవేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కోటి ఉత్తరాల ఉద్యమం చేపట్టామన్నారు. దానికి దేశవ్యాప్తంగా తెలుగువారందరి నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. కరీం నగర్ లో టిడిపి నాయకులు కె.ఆగయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని అన్నారు. దాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టడానికి కార్యాచరణ చేపట్టడం శుభపరిణామం అన్నారు. ఎన్టీఆర్ అభిమాని ప్రతీఒక్కరూ ఆయనకు భారత రత్నఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారన్న స్వామి తెలుగువారి అన్నగారు, అభిమాన ఎన్టీఆర్ కళారాధన పీఠం ద్వారా 25 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు సంఘాలుగా ఏర్పడి ఎన్టీఆర్ కోసం కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. తెలుగువారు వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అందరు కళాకారులు అభిమానించే ఏకైకన నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నేటికి భారత రత్న ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ పోస్టుకార్డు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం కార్యక్రమాలు రూపొందించే విధంగా ఆగయ్య చేస్తున్న క్రుషి అభినందనీయమని ఎస్ఎల్ఎన్ స్వామి చెప్పారు.