మీతో కలిసి కాఫీ తాగాలని వుంది..!
Ens Balu
1
రామాపురం గ్రామం
2020-10-07 19:10:21
అక్కా కలెక్టర్ బాబు మన పొలానికొచ్చారే...లే లే... నమస్కారం కలెక్టర్ బాబూ... నమస్కారం.. ఏ అమ్మా ఎలావున్నారు.. పొలం పనులు బాగా గిట్టు బాటు అవుతు న్నాయా.. ఆయ్యో పొలాల్లో చాలా ఎక్కువగా కష్టపడుతున్నారే...మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందో లేదో.. కనీసం అధికారులైనా మీ దగ్గరకి ఎపుడైనా వస్తున్నారా.. ఈ ఏడాది దిగుబడి ఎలావుంది.. ఈ కుశల ప్రశ్నలన్నీ వేస్తున్నది ఓట్ల కోసం ఐదేళ్ల కోసారి వచ్చే ఏ రాజకీయనాయకుడో అనుకుంటున్నారా..అలా అనుకుంటే పొలం బురదలో కాలు పెట్టినట్టే.. రైతుల కష్టాలు.. పండే పంటలు ఏవిధంగా ఉన్నాయి.. వారి పరిస్థితి ఏంటి అనే విషయాలు స్వయంగా తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడి ఆత్మీయ పలరింపు. ఏవిషయాన్నై గ్రామస్థాయిలో స్వయం తెలుసుకొని మరీ ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంతో అనంతపురం జిల్లా కలెక్టర్ పెట్టింది. పేరు. అలాంటి ఆయన బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో వేరుశనగ పంట నష్టాలను స్వయంగా చూసి అంచనా వేశారు. అక్కడ రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. అక్కడ కన్నీటితో రైతులు వాస్తవ పరిస్థిని కలెక్టరుకు వివరించడంతో నష్టాన్ని ఆయనే నమోదు చేసుకున్నారు. నేరుగా కలెక్టరే వచ్చి రైతులు బాగోగులు తెలుసుకోవడానికి రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. కలెక్టర్ తో తమ సమస్యలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పారు. ఎంతో ఆప్యాయతగా పొలానికి వచ్చిన కలెక్టర్ మీతో పాటు కలిసి కాఫీ తాగాలని వుంది అంటూ అడగటంతో అక్కడ వున్న మహిళా రైతుల్లో ఒక్కటే ఆనందం... ఆయ్యో బాబూ మీరు మాతో కాపీ తాగుతారా అంతకంటే ఏం కావాలి అంటూ ఒక్క ఉదుకున వెళ్లి కాఫీ తెచ్చి మరీ ఇచ్చారు. రైతులతో కలిసి కాఫీ తాగి, వారితో అక్కడ గంటపాటు గడిపి వెనుతిరుగుతూ, మీ సమస్యలను తక్షణమే ప్రభుత్వానికి చేరవేస్తాను అంటూ చెప్పడంతో మీ దయబాబు...ఇన్నాళ్లకి మా రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వైఎస్ జగన ప్రభుత్వంలో ఆదేవుడే మా దగ్గరకి పంపాడంటూ ఆ రైతులంతా దండాలు పెట్టారు. ఈ తంతు అంతా గమనిస్తున్న అధికారులు ఒక్క గంటపాటు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అదే సమయంలో తమ లోపాలు ఎక్కడ రైతులు కలెక్టర్ ముందు ఏకరువు పెడాతారోననే భయం ఒక్కటి. వెరసీ కలెక్టర్ రైతులతో కాఫీ తాగి, సమస్యలు అడిగి తెలుసుకున్న విషయం కళ్లకు కట్టినట్టుగా మీ ముందు ఉంచిదీ ఈఎన్ఎస్ లైవ్ యాప్. ప్రజల కష్టాలను, నష్టాలను, వారి బాధలను తెలుసుకోవాలంటే ఐఏఎస్ అధికారులు ఏసీ రూమల్లో కూర్చోరని, నిజ నిర్ధారణ చేసుకోవడానికి స్వయంగా పొలాలకు సైతం వెళతారని గంధం చంద్రుడు నిరూపించిన వైనం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయ్యింది.. ఎంతైనా దిల్ ఉన్న కలెక్టర్ దిల్లున్నోడే..!