నిర్వాసితులందరికీ పరిహారం..


Ens Balu
2
మర్రిమాకులపల్లి
2020-10-07 19:12:40

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా పరిహారం పంపిణీ, నీటి నిల్వ విషయమై ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సీబీఆర్ కింద ముంపునకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి పరిహారం అందించామని, అందరికీ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యాంకర్లతో మాట్లాడి మొత్తం డబ్బులు ఒకేసారి ఇచ్చేలా, పాత అప్పులకు జమ చేసుకోకుండా మొత్తం నగదు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోపు గ్రామంలోకి నీళ్లు వచ్చేస్తాయని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు 2006 వరకు మేజర్ అయ్యి ఉండి పెళ్లికాని యువతులకు కూడా పరిహారం అందించాలని కోరగా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్ డి ఓ మధుసూదన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.