ఆరోగ్య కార్యదర్శిలకు ట్యాబ్ లు..


Ens Balu
0
Tirupati
2020-10-07 19:30:02

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల ఆరోగ్య పరమై అంశాలతోపాటు ప్రభుత్వ ఆరోగ్యసేవలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.  బుధవారం తన చాంబర్ లో ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్ లను ఆరోగ్య సిబ్బందికి కమిషనర్ గిరీష అందజేశారు. ఆర్ సి హెచ్  రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్, ప్రభుత్వ కార్యక్రమములు ఆన్ లైన్ ప్రక్రియ చేయడానికే వీటిని  పంపిణీ చేశామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 102 వార్డ్ సచివాలయం లో 120 మందికి ఆరోగ్య కార్యదర్శులకు, ఏఎన్ఎంలు కు మొదలగు వారికి క్షేత్రస్థాయిలో నిర్వర్తించే ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమంలో అయిన, మత శిశు సంరక్షణ, పునరుత్పత్తి శిశువు ఆరోగ్యం, కరోనా కు సంబంధించిన మొదలైన కార్యక్రమాలన్నింటినీ ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా 100% వ్రుద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఆరోగ్య అధికారి డాక్టర్ సుధారాణి, నగరపాలక ఉప గణాంక అధికారి నీలకంటేశ్వర రావు, ఆరోగ్య విస్తరణ అధికారి మోహన్, మధుసూదన్, వార్డ్ ఆరోగ్య కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.