పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు..


Ens Balu
2
కలెక్టరేట్ ప్రాంతం
2020-10-07 19:53:59

పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన అధికారులను హెచ్చరించారు . బుధవారం క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషనర్ రెండు, మూడు జోన్ల లోని ప్రాంతాలైన ఆర్.కె. బీచ్ రోడ్డు, కలక్టర్ ఆఫీసు, జగదాంబ, మున్సిపల్ స్టేడియం, డైమండ్ పార్కు తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. పలుచోట్ల కాలువల్లో చెత్తపేరుకుపోయి వుండటాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి  పలు సూచనలు చేసారు. కాలువలు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాలువలలో, చెత్త వెస్తే జరిమానా విధించాలన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రత పై శ్రద్ద వహించాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందు వలన కలువల యు.జి.డి. కనక్షన్లు పొంగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబందిత జోనల్ కమిషనర్లు, శానిటరీ సూపెర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.