జగనన్న విద్యాకానుక రేపే..


Ens Balu
1
కలెక్టరేట్
2020-10-07 19:58:57

చిత్తూరు  జిల్లా లో ఈ నెల 8 న "జగనన్న విద్యా కానుక" పంపిణికి సర్వం సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా బుధవారం  తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టా త్మకంగా జగనన్న విధ్యా కానుక కిట్లను విధ్యార్ధులకు పంపిణి చేసిన అనంతరం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరియు పాటశా లల్లో జగనన్న విధ్యా కానుక కిట్లను పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా "జగనన్న విధ్యా కానుక " కింద 4,857 పాటశాలల్లో 1,86,958 మంది బాలురు, 1,93,382 మంది బాలికలు మొత్తం 3,80,340 మంది విధ్యార్ధిని, విధ్యార్ధులకు జగనన్న విధ్యా కానుక కింద కిట్లను పంపిణి చేయనున్నట్లు తెలిపారు.ఈ కిట్ నందు పాటశాల బ్యాగ్,ఘా  మరియు సాక్స్, మూడు జతల యూనిఫాం, బెల్ట్, నోటు పుస్తకాలు అంద జేయడం జరుగుతుందని తెలిపారు.  కోవిడ్ నేపధ్యం లో ఈ కార్యక్రమంలో పాల్గొ నే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించాలని, శ్యానిటైజర్ ప్రతి పాటశాలల్లో ఉండే టట్లు చర్యలు తీసుకోవా లని విధ్యా శాఖ అధికా రులను ఆదేశించడం జరి గిందని, విధ్యార్ధుల తల్లి బయో మెట్రిక్ గుర్తింపు తీసుకొని జగనన్న విధ్యా కానుక కిట్లను అంద జేయాలని తెలిపారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి సంబం దించిన జిల్లా స్థాయి కార్యక్రమం బి.ఎస్.కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాటశాల చిత్తూరు నందు ఉదయం 10 గంటలకు జరుగునని, ఈ కార్యక్రమానికి చిత్తూరు శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమం నియోజకవర్గ పరిధిలో ప్రజా ప్రతినిధులచే నిర్వహించడం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు.