గురుకులాల్లో సీట్ల భర్తీ పూర్తి..
Ens Balu
1
Srikakulam
2020-10-07 20:02:55
శ్రీకాకుళం జిల్లాలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాల ఎంపిక లాటరీ ద్వారా పూర్తయిందని గురుకుల పాఠశాలల కన్వీనర్ జల్లు లక్ష్మణ మూర్తి బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ నియమించిన ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 6 న బాలికలకు, 7 న బాలురకు లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని అన్నారు. టెక్కలి లో 80 ఖాళీలను గాను 79 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మిగిలిన ఒక్క సీటు ను ఆర్ఫన్ కేటగిరి లో ఖాళీ ఉందని తెలిపారు. శ్రీకాకుళం కు 40 ఖాళీ లకు 39 మంది విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేశామని ఆర్ఫన్ కేటగిరీలో ఒక్క ఖాళీ ఉందన్నారు. ఆమదాలవలస 80 ఖాళీ లకు 76 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. ఆర్ఫన్ కేటగిరి లో ఒకటి, ST కేటగిరి లో మూడు సీట్లు ఖాళీ గా ఉన్నాయన్నారు. పలాసా కు 40 సీట్ల కు 39, పాతపట్నం 40 కి 39 మంది విద్యార్థులను ఎంపిక చేశామని మిగిలిన ఒక్క సీటు ను ఆర్ఫన్ కేటగిరి లో ఖాళీ ఉందని తెలిపారు. మొత్తం 280 సీట్లకు 272 మంది బాలిక విద్యార్థినులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. బాలుర ఖాళీలను సంబందించి అంపోలు పాఠశాలకు 80 సీట్ల కు 79, నరసన్నపేట 40 కి 39 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. సంతబొమ్మాళి 80 కి ఖాళీ లకు 73 మంది విద్యార్థులను ఎంపిక చేశారని వివరించారు. ST కేటగిరి లో రెండు సీట్లు, ST కేటగిరి లో ఐదు సీట్లు ఖాళీలున్నాయన్నారు. మొత్తం 200 సీట్లకు 191 మంది విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తొమ్మిది సీట్లు ఖాళీ గా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా విద్యాశాఖాధికారి చంద్ర కళ, బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా బీసీ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్స్, శ్రీకాకుళం డిబిసిడబ్ల్యూ, విద్యార్థుల తల్లిదండ్రుల తదితరులు పాల్గొన్నారు.