నేషనల్ స్కాలర్ షిప్ దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
1
Srikakulam
2020-10-07 20:10:45

జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల కొరకు ఈ నెల 20లోగా నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ పేర్కొన్నారు. అక్టోబర్ 20లోగా నమోదుచేయని లేదా రెన్యూవల్ చేయని విద్యార్ధులకు MHRD న్యూఢిల్లీ వారి నుండి స్కాలర్ షిప్ మంజూరుచేయబడదని ఆమె స్పష్టం చేసారు. గతేడాది నవంబర్ లో జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష ( NMMS ) నందు సెలక్ట్ అయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని ఆమె చెప్పారు. నేషనల్ ప్రతిభా పత్రముల వెనుక సూచించిన మార్గదర్శకాలకు అణుగుణంగా విద్యార్ధి వివరాలను సంబంధిత వెబ్ సైట్ నందు నమోదుచేసుకోవాలని తెలిపారు. అలాగే నవంబర్ 2017 మరియు 2018 సం.లలో జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షలలో సెలక్ట్ అయి ప్రస్తుతం 10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్ధులు కూడా నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేసుకోవాలని ఆమె సూచించారు. రెన్యూవల్  కొరకు గతేడాది విద్యార్ధి యొక్క యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ లను ఉపయోగించి లాగిన్ కావచ్చన్నారు. విద్యార్ధి లాగిన్ నందు రెన్యూవల్ తర్వాత వచ్చిన దరఖాస్తును  విద్యార్ధి మరియు ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్ సంతకం చేసి జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళంనకు సమర్పించాలని కోరారు. విద్యార్ధి లాగిన్ లో అప్లై లేదా రెన్యూవల్ చేసిన తర్వాత స్కూల్ లాగిన్ నందు ప్రధానోపాధ్యాయులు అప్రోవల్ చేయాలని, ఈ ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేసారు.