విధుల్లో అలసత్వం క్షమించేది లేదు..
Ens Balu
3
వీఎంఆర్డీఏ థియేటర్
2020-10-07 20:13:07
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, ఆయన ఆశయ సాధనకు మనవంతు కృషి చేయాలని వార్డు కార్యదర్శిలను ఆదేశించారు. బుధవారం వీఎంఆర్డీఏ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రముఖంగా వార్డు సేక్రటరీలకి రెండు బాధ్యతలు ఉంటాయన్నారు. ప్రతీ రోజూ హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, డైరీ విధిగా రాయాలన్నారు. పలు సచివాలయాలలో కార్యదర్శులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చాలా వార్డులలో సేవల దరఖాస్తులు పెండింగులో ఉండడాన్ని గమనించామని వాటిపై వెంటనే చర్య తీసుకోవాలన్నారు. సచివాలయాలలో బిల్లు కడుతున్నప్పుడు సొంత బ్యాంకు ఖాతా ఏ.టి.యం. కార్డులను ఉపయోగించరాదని అన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు, ఫించన్, ఇల్లు లేని వారికి ఇళ్ళు మొదలైన సేవలను మనం ప్రజలకు అందించిననాడు మనల్ని ప్రజలు గుర్తించుకుంటారని అన్నారు.
అనంతరం, ఒకటవ జోనల్ కమిషనర్ రాము మాట్లాడుతూ, చాలామంది సరిగా సమయానికి విధులకు రావడం లేదని ఇకపై అలా జరగకూడదని అన్నారు. 2వ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం పూర్తి అయిందని ఇంకా మీరు విద్యార్థి దశలో లేరని మీకున్న వనరులతోనే వ్యవస్థను నడపాలని, మీ సర్వీసుతో ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. మూడవ జోనల్ కమిషనర్ బి. సన్యాసినాయుడు మాట్లాడుతూ మొదట అడ్మిన్లు సబ్జెక్టు నేర్చుకోవాలని, ముఖ్యమంత్రి మంచి ఉద్దేశ్యంతో సచివాలయ వ్యవస్థను స్థాపించారని లక్షా 50వేల కుటుంబాలకు ఆయువు పోసారన్నారు. దీనిని మనం నిర్వీర్యం చేయకూడదని హితవు పలికారు. 5వ జోనల్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ సెలవు అనేది మీ ప్రాథమిక హక్కు కాదని ప్రత్యేక కారణం, ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెట్టకూడదని మనం ప్రజలతో మమేకమై ఉన్నామని, వారికి సర్వీస్ ఎంత బాగా చేస్తే అంత పేరు వస్తుందన్నారు. 6వ జోనల్ కమిషనర్ రమణ మాట్లాడుతూ ప్రజలకు పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా ఏదో ఒక సర్వీసును ఇస్తున్నామన్నారు. ఇష్టంతో పనిచేస్తే కష్టం అనేదే ఉండదని అన్నారు. సరిగా విధులు నిర్వహించని కారణంగా 47మంది వార్డు సెక్రటరీలకు మెమోలు జారీ చేస్తే, ఐదు మంది మాత్రమే సమాధానం ఇచ్చారని అన్నారు. అనకాపల్లి జోనల్ కమిషనర్ మూర్తి మాట్లాడుతూ, రెవెన్యూ సెక్రటరీలు మా వద్ద బాగానే పనిచేస్తున్నందువలన ఈ ఆర్థిక సంవత్సరం 50 లక్షలు అదనంగా రెవెన్యూ వసూలు చేయగలిగామన్నారు. భీమిలి జోనల్ కమిషనర్ గోవిందరావు మాట్లాడుతూ మీకు రెండు నెలల వ్యవధిలోనే ఉద్యోగాలు వచ్చాయని, మీకు ఇచ్చిన గుర్తింపు ఎవ్వరికీ దక్కదని, అందువలన అందరూ శ్రద్ధతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ కమిషనర్(రెవెన్యూ) ఎం.వి.డి.ఫణిరాం, జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, టేక్స్ కలక్టర్లు, వార్డు సచివాలయ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.