ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటించాల్సిందే..
Ens Balu
3
Kakinada
2020-10-08 13:25:43
నటరత్న ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా బలంగా వినిపిస్తోంది. విశాఖలోని డాక్టర్ ఎన్టీఆర్ కళరాధ న పీఠం ఫౌండర్ చైర్మన్ ఎస్. ఎల్.ఎన్. స్వామి పిలుపుతో ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ వాణి బలంగా వినిపిస్తూ..పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొంటున్నారు. గురువారం కాకినాడ లో ఎన్టీఆర్ కళారాధ నా పీఠం కన్వినర్ తురగా సూర్యారావు నటరత్న ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రికి లేఖలు పంపారు. అంతేకాకుండా పోస్టల్ శాఖలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులంతా ఈ విషయంలో కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వలేదని ఆరోపించిన ఆయన బీజెపీ ప్రభుత్వం ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాకుండా స్థానిక బి జె.పి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కూడా తమ బి. జె.పి పార్టీ మీటింగ్ లో అన్న ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ప్రధాని మోడీకి లేఖలు పంపుతామని చెప్పినట్టు ఆయన వివరించారు. రాష్ట్రాలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా ఎన్టీఆర్ అభిమానులంతా చురుగ్గా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ పోస్టల్ శాఖ అభిమానులు పాల్గొన్నారు.