డ్రైవింగ్ తో ఉపాది అవకాశాలు..


Ens Balu
2
Srikakulam
2020-10-08 14:19:19

డ్రైవింగ్ శిక్షణతో  ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందవచ్చుసని సంయుక్త కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం ) శ్రీరాములు నాయుడు అన్నారు. గురువారం ప్రజా రవాణా శాఖ కార్యాలయంలో హెవీ వెహికల్ లైసెన్స్ శిక్షణ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జె.సి. ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. అదే విధంగా యువతకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రజా రవాణా శాఖ హెవీ వెహికల్  డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు.  ప్రజా రావాణా శాఖలో  మంచి నిపుణులైన డ్రైవర్ల ద్వారా డ్రైవింగ్ పై శిక్షణ నివ్వడం జరుగుతుందన్నారు.  తద్వారా డ్రైవింగ్ లో మెళుకువలు నేర్చుకోవచ్చునన్నారు.  డ్రైవర్లకు ఎక్కువ డిమాండ్ వుందన్నారు.  ప్రతీ గ్రామంలో నిరుద్యోగ యువత అధికంగా వున్నారని, ఇటువంటి ట్రైనింగులు ద్వారా స్వయం ఉపాధికి మంచి అవకాశాలు వుంటాయన్నారు. నిబధ్ధతతో శిక్షణ పొందాలని,  రహదారి ప్రమాదాలు జరుగకుండా డ్రైవింగ్ చేసి ప్రజా రవాణా శాఖ కు, జిల్లాకు  మంచి పేరు తీసుకురావలని హితవు పలికారు. ట్రైనింగ్ అభ్యర్ధులలో జలుమూరు మండలం, చల్లవాని పేట నుండి చల్లా ఆశ అనే మహిళ పాల్గొనడం సంతోషదాయకమన్నారు.          ప్రజా రవాణా శాఖ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రస్తుతం  హెవీ వెహికల్ డ్రైవర్ల కొరత ఎక్కువగా వుందని, ప్రజా రవాణా శాఖ  లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్నదని అన్నారు. 2008-09 సం.లో లైట్ వెహికల్ డ్రైవింగ్ లో తమ శాఖ ద్వారా శిక్షణ నివ్వడం జరిగిందని తెలిపారు.  అద్దె బస్సులకు డ్రైవర్లు అవసరం చాలా  వుందన్నారు. ఈ శిక్షణ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు.  40 రోజుల పాటు అందించే శిక్షణ ద్వారా డ్రైవింగ్ మెలుకువలు నేర్చుకోవాలని చెప్పారు. ట్రైనింగ్ అనంతరం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి బ్యాచ్ లో 16 మందికి శిక్షణ నిస్తున్నామన్నారు.  మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి.శివరాం గోపాల్ మాట్లాడుతూ, ఇది మంచి శుభ పరిణామమని అన్నారు.  ముఖ్యంగా డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా వుండాలన్నారు. ఓర్పు, సహనం కలిగి వుండాలని సూచించారు.  అనంతరం డ్రైవింగ్ శిక్షణ, రహదారి సంకేతాలు అనే రెండు  బ్రోచర్ లను విడుదల చేసారు.  జెండా ఊపి డ్రైవింగ్ శిక్షణ బస్సును ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా శాఖ రీజనల్ మేనేజర్ ఎ.అప్పల రాజు, డివిజనల్ మేనేజరు జి.వరలక్ష్మి, 1,2 వ డిపో మేనేజర్లు వి.ప్రవీణ, టి.కవిత, ఎ.డి.సి. బిడ్డిక మంగ, ట్రైనింగ్ అభ్యర్ధులు,  తదితరులు పాల్గొన్నారు.