నాడు-నేడు పనులు సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
4
Srikakulam
2020-10-08 18:38:26

శ్రీకాకుళం జిల్లాలో నాడు-నేడు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా  కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్ పరిశీలించారు.  విద్యార్ధులకు మంచి మెరుగైన సౌకర్యాలను కలిగించాలని, పనులలో నాణ్యత పాటించాలని చెప్పారు.  పాఠశాలలు ప్రారంభించే నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలన్నారు. అదేసమయంలో పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం, సుందరీకరణ పనులు కూడా పూర్తిచేయాలన్నారు. విద్యార్ధుల సౌకర్యార్ధం మరుగుదొడ్లు, మంచినీరు, ఆట పరికరాలు ఇలా అన్నివసతులను సమకూర్చాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, సర్వ శిక్ష అభయాన్ ప్రాజెక్టు అధికారి పైడి వెంకట రమణ, ఉప విద్యా శాఖాధికారి పగడాలమ్మ, ఎ.పి.ఇ.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్  ఇంజనీరు కె.భాస్కరరావు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.