అధికారులూ హాజరు తప్పనిసరి..
Ens Balu
1
Tirupati
2020-10-08 18:53:39
ప్రభుత్వ సేవల పరిష్కారంతో పాటు సెక్టోరల్ అధికారులు, అడ్మిన్ కార్యదర్శులు ప్రతిరోజు అటెండెన్స్ తప్పనిసరి వేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీష ఆదేశించారు. గురువారం సంస్థ కళాప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు సత్వరమే అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న వాటిని మొత్తం నిశ్చితమైన సమయానికి పూర్తి చేసి, మీ లాగిన్ లో ఉన్న ఫైల్స్ అన్నీ మీ పై అధికారులకు (ముందుకు) ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. నగరంలో 50 వార్డులలో వార్డు కార్యదర్శులు ప్రతి షాపును రీ సర్వే చేసి వాటికి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా పరిశీలించాలని, లేని వాటికి కొత్తగా దరఖాస్తులు చేయించి కార్యాలయానికి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చాలన్నారు. నగరంలో కొత్తగా కడుతున్న గృహాలు వాటి అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలించాలని, లేని వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అడ్మిన్ కార్యదర్శులతో పాటు సిబ్బందిని కలుపుకొని అన్ని పనులు చూడాలని, సమస్యల తో వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు, ప్రతి దరఖాస్తులు గడువులోపు పరిష్కరించాలని, వివిధ ప్రభుత్వ పథకాలు సకాలంలో సమర్థవంతంగా ప్రజల ముంగిటకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ వారితోపాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి,సూపర్డేటింగ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, మేనేజర్ హసిమ్,సెక్టోరల్ ఆఫీసర్లు సేతు మాధవ్, గాలి సుధాకర్, రవి, నీలకంటేశ్వర రావు, మధు బాబు, రవికాంత్, రమణ, అడ్మిన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.