స్మార్ట్ సిటీ పనులు జనవరినాటికి పూర్తికావాలి..


Ens Balu
2
కాపులుప్పాడ
2020-10-08 19:01:00

 జివిఎంసి పరిధిలోని స్మార్ట్ సిటీ పధకం కింద చేపడుతున్న  పనులను పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి గురువారం పరిశీలించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో జిందాల్ కంపనీ చేపట్టిన చెత్త నుండి విద్యుత్ తాయారుచేసే ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనులు డిశంబర్ నెలాఖరకు త్వరితగతిన పూర్తిచేయాలని కంపనీ ప్రతినిధులకు సూచించారు. పర్యటనకు గుర్తింపుగా ఆ ప్రాంతంలో మొక్క నాటారు. తదుపరి ఎం.వి.పి. కాలనీలో ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో నిర్మాణం లో ఉన్న స్మార్ట్ సిటీ పధకంతో నిర్మిస్తున్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా పనులు, ఉడా పార్కులో చేపట్టిన ఆధునీకరణ పనులు, పాత మున్సిపల్ కార్యాలయం, టౌన్ హాలు ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఈ పనులన్నింటిని కూడా డిశంబర్, జనవరి నెలల నాటికి సూచించిన విదంగా పనులు పూర్తీ చేయాలని స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఇంజినీరులను ఆదేశించారు. ఈ పర్యటనలో జివిఎంసి కమిషనర్  ప్రధాన ఇంజినీరు ఎం.  వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.వి.ఎన్. రవి, వినయ కుమార్ ఇతర ఇంజినీరింగు అధికారులు పాల్గొన్నారు.