ప్రజాసేవలో అలసత్వం సహించేది లేదు..


Ens Balu
1
వీఎంఆర్డీఏ థియేటర్
2020-10-08 19:06:19

జివీఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ మౌళిక వసతుల(ఎమినిటీ)  కార్యదర్శులు క్రమశిక్షణతో పనిచేయాలని  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు. గురువారం వీఎంఆర్డీఏ థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యదర్శిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆయన ఆశయ సాధనకోసం మనం ఎంతో కృషిచేయాలన్నారు. ప్రతీ రోజు హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, డైరీ విధిగా రాయాలన్నారు. ఉద్యోగ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని కార్యదర్శులను హెచ్చరించారు. మీకు గతంలో శిక్షణా తరగతులు నిర్వహించమని, ముఖ్యంగా ప్రణాళికా బద్దంగా నిర్ణయాలను తీసుకోవాలన్నారు. పర్మనెంట్ రికార్డులైన పబ్లిక్ ట్యాప్, కంప్లైంట్ రిజిస్టర్, యు.జి.డి. స్టాక్ రిజిస్టర్, క్వాలిటీ మూమెంట్ రిజిస్టర్, బోరవెల్ మెటీరియాల్ రిజిస్టర్ మొదలైనవి తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతీ రోజు ప్రజలకు ఇచ్చే మంచి నీటిని క్లోరిన్ టెస్ట్ చేయించాలన్నారు. అలాగే కొళాయిలు, వీధిలైట్లు, రోడ్లు, కాలువలు, పార్కులు, ఖాళీ ప్రదేశములు, ప్లే గ్రౌండ్స్, యు.జి.డి. కనక్షన్లు మొదలైన వాటి వివరాలు మీ వద్ద తప్పని సరిగా ఉండాలన్నారు. వార్డు ప్లానింగ్ మ్యాప్ చలా అవసరం కాబట్టి, మీరు తప్పనిసరిగా దానిపై అవగాహన పెంచుకొని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకోవాలన్నారు. పనులను సకాలములో పూర్తీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడలన్నారు.  ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, వార్డు సచివాలయ కార్యదర్శులకు ఒక సంవత్సరం పూర్తీ అయినందున, మీరు ఇంకా విద్యార్ధులు కారని, మంచి క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు దగ్గరగా పరిపాలన అందించాలన్నారు. లాక్ డౌన్ లో చాల బాగా పనిచేసారని, నాడు – నేడు పనులు చాల వరకు పూర్తీ అయినందున, వాటి రికార్డులను పొందుపరచాలన్నారు. వీధి లైట్లు ఇంకా కంప్లైంట్స్ వస్తున్నందున, ప్రతీ రోజు సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు పరిశీలించి సహాయక  ఇంజినీరులకు రిపోర్టు చేయాలన్నారు. తదుపరి ప్రయవేక్షక ఇంజినీర్లు అందరూ, శిక్షణా తరగతులపై పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీర్లు వినయ కుమార్, ఇంజినీరు వేణుగోపాల్, రాజా రావు, శ్యాంసన్ రాజు, శివ ప్రసాదరాజు, గణేష్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయక  ఇంజినీరులు, వార్డు ఎమినిటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.