ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దులకు మెరుగైన విద్య..
Ens Balu
3
చిన వాల్తేరు
2020-10-08 19:09:31
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుకను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని జివీఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అన్నారు. గురువారం ఆమె, జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల చిన్నవాల్తేర్ లో 30మంది విద్యార్థినీ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాంలు, మాస్కులు, బూట్లు, సాక్సులు, బెల్టులు, పాఠ్య పుస్తకములు మరియు నోటు పుస్తకములు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లను అందజేస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్ధి ఉత్తమ ర్యాంకులు తెచ్చుకునే విధంగా భోదనలో మార్పులు తీసుకు రావాలని ఉపాద్యాయులను కోరారు. విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేసి ప్రభుత్వ ఆశయాలను సఫలీకృతం చేయాలన్నారు. మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.