అమ్మవారి ఉత్సవంపై సమీక్ష రేపు..
Ens Balu
1
Vizianagaram
2020-10-08 19:34:19
విజయనగరంలో ఈ ఏడాది శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్‌లాల్ తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, పట్టణంలోని పలు స్వచ్ఛందసంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వర్తక, వాణజ్య సంఘాలు, వైద్యులు, పాత్రికేయులు, జిల్లా అధికారులు తదితరులంతా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కోవిడ్ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించి ఉత్సవాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ విదివిధానాలుపై ఆదేశాలు జారీచేస్తారని వివరించారు.