రైస్ కార్డుల జారీ మరింత వేగం పెంచాలి..
Ens Balu
1
కలెక్టరేట్
2020-10-08 19:38:36
విజయనగరం జిల్లాలో కొత్త రైస్ కార్డుల జారీ ప్రక్రియలో వేగం పెంచేందుకు.. జాప్యతను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సుబ్బారావులు స్వయంగా జిల్లాలో ఉన్న వివిధ గ్రామాల విఆర్వోలకి కాల్ సెంటర్ ద్వారా ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్డుల జారీ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రెండు విభాగాల అధికారులు గ్రామ స్థాయి అధికారులతో సంప్రదింపులు చేశారు. ఇప్పటి వరకు జారీ చేసిన, పెండింగ్ లో ఉన్న కార్డుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్ లు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని వీఆర్వొలని ఆదేశించారు. లబ్ధిదారుకు కార్డ్ జారీ చేసిన వెంటనే సంబంధిత అక్నాలెడ్జిమెంట్ ని విధిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న కార్డుల అందుబాటులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.