కార్పోరేట్ కంటే మెరుగైన విద్యే లక్ష్యం..


Ens Balu
1
దక్షిణ నియోజకవర్గం
2020-10-08 20:04:56

ఆంధ్రప్రదేశ్ లో కార్పోరేట్ స్థాయి కంటే మెండుగా నిరుపేద విద్యార్ధులకు విద్య అందించేందుకు సీఎం వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. గురువారం విశాఖలోని క్వీన్ మేరీ పాఠశాలలో ఎమ్మెల్యే వాసుపల్లి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండారాజీవ్ గాంధీతో కాలిసి విద్యార్ధులకు జనగన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి తేడా లేకుండా అందరికి ఒకే రకంగా 3 జతల యూనిఫారం, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్ లు బెల్టులు, షూలు, సాక్సులు, స్కూల్ బ్యాగ్స్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థుల కొలతలు తీసుకుని వారి సైజుకు తగినట్లుగా అన్ని సిద్ధం చేసి వారికి అందిస్తున్నామన్నారు. కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక కింద పిల్లలను చదివించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నాడునేడు కింద అన్ని పాఠశాలలు కార్పోరేట్ స్థాయి పాఠశాలలుగా మార్పు చేసిందన్నారు. దేశంలోనే అత్యున్నత విద్యను అందించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైఎస్సార్సీపీ మహిళా నేత గరికిన గౌరి మాట్లాడుతూ,  సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితే పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు.  కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.