ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ విద్య..


Ens Balu
2
Rampachodavaram
2020-10-08 20:07:43

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. గురువారం గురువారం వై.రామవరం, అడ్డతీగల ప్రాంతాల్లో  జగనన్న విద్యా కానుక  కిట్లను డిసిసిబి చైర్మన్ అనంతబాబుతో కలిసి గిరిపుత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడానికి నాడు-నేడు కింద అన్ని పాఠశాలలను నిత్యనూతనంగా తయారు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు నిత్యనూతనంగా మారాయని, ఈ ప్రభుత్వంలో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా పాఠశాలలను సర్వాంగ సందరంగా మునుపెన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తయారు చేశారన్నారు. త్వరలోనే ఇంగ్లీషు మీడియంలో కూడా విద్యనందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.