నిరుపేదల విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహం అపారం..


Ens Balu
0
ఆంధ్రాయూనివర్శిటీ
2020-10-08 20:48:36

రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం అపారమని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఉదయం వర్సిటీ పాలక మండలి సమావేశ మందిరంలో ఏయూ తెలుగు మాధ్యమం పాఠశాల విద్యార్థుల•కు  జగనన్న విద్యా కానుకను అందించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నారు. ప్రతీ వ్యక్తి విద్యావంతుడు కావడం వలన సమా ప్రగతి సాధ్యపడుతుందన్నారు.  నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పాఠశాలల అభివృద్ధికి నిధులను కేటాయిచి చిన్నారులపై తన అపార అభిమానాన్ని ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా చూపారన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు ప్రతీ స్థాయిలో విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్రంలో విద్యా వంతుల సంఖ్యను గణనీయంగా పెంచుతాయన్నారు. తద్వారా ప్రతీ కుటుంబం పూర్తిస్థాయిలో ఆర్ధిక, సామాజిక పరిణితి సాధించడం వీలవుతుందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు నిర్ధిష్ట లక్ష్యంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి రవీంధ్రనాథ్‌ ‌బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని డి.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.