కన్జర్వేషన్ పనులు తక్షణం పూర్తిచేయాలి..


Ens Balu
2
Vizianagaram
2020-10-09 16:04:22

 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ వెల్నేస్ కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు.  ఆ మేరకు నియోజక వర్గాల ప్రత్యేకాధికారులకు ఆదేశాలు జారీచేసారు.  జిల్లాలో 664 గ్రామ సచివాలయాలు, 628 రైతు భరోసా కేంద్రాలు, 509 వెల్నెస్ కేంద్రాలు, 804 అంగన్వాడి కేంద్రాలను నిర్మించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని అయితే ఇప్పటికీ గ్రౌండ్ కాకుండా అనేక భవనాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.  ఈ పనులను పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ అధికారుల ద్వారా చేపట్టడం జరుగుతోందని ఆయా ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించుకొని పనులు వచ్చే మార్చి 31లోగా అన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు.  అందుకోసం స్ధానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు జరిగేలా చూడాలన్నారు.  భూసంబంధిత సమస్యల కోసం స్ధానిక తహశీల్ధార్లతో చర్చించుకోవాలని సూచించారు.  నియోజక వర్గ ప్రత్యేకాధికారులు పనుల పురోగతిపై ప్రతి శనివారం నివేదికను నిర్ధేశించిన ప్రొఫార్మాలో అందజేయాలని ఆదేశించారు.  జిల్లాలో గల తొమ్మిది నియోజక వర్గాలలో 74 గ్రామ సచివాలయ భవనాలు, 225 రైతు భరోసా కేంద్రాల భవనాలు, 231 వెల్నెస్ భవనాలు మొత్తం 529 భవనాల గ్రౌండ్ కాలేదని, వీటిని త్వరితగతిన గ్రౌండింగ్ చెయ్యాలన్నారు.