ప్రజలకు సేవలు పారదర్శకంగా చేయాలి..


Ens Balu
3
Renigunta
2020-10-09 16:31:37

సచివాలయ వ్యవస్థ అందిస్తున్న సేవలు ప్రజలకు మరింత దగ్గర కావాలని, వాలింటీర్ల ద్వారా సంక్షేమం ఫలాలు గడపకే అందించి  పారదర్శకత చాటలని జిల్లా  సంయుక్త కలెక్టర్  (అభివృధ్ధి) వీరబ్రహ్మం సూచించారు. శుక్రవారం  రేణిగుంట మండలంలోని కరకంబాడి 1, రేణిగుంట 1, గురవారాజుపల్లె గ్రామసచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. కరకంబాడి 1 సచివాలయం సందర్శించిన జెసి   సిబ్బందితో సమావేశమై  ప్రజాసమస్యల పరిష్కారంలో వ్యవసాయ, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, రేషన్ కార్డులు తదితర సేవలపై అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యం సేవల తెలుకునే  సమయంలో ఎ.ఎన్.ఎం రోహిణి గైర్హాజరును గమనించి క్రమ శిక్షణా చర్యలకు డి ఎం అండ్ హెచ్ ఓ ను పోన్ ద్వారా ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్నది, ఎందరో అభినందనలు అందుకున్న  మీరు  పారదర్శకతతో పనిచేయాలని, పథకాలకు అర్హులైన వారికి అందేలా చూడాలని   సూచించారు. రేణిగుంట 1 సచివాలయ సందర్శనలో సచివాలయం వద్ద సచివాలయ సేవల వివరాలు, కాల్ సెంటర్ లు , టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా పోలీసు పూర్ణిమ సమాధానాలకు ఆమెను అభినందించారు. గురవరాజు పల్లె సచివాలయం సందర్శించి  రికార్డులు పరిశీలించి సంతృప్తి  వ్యక్తం చేసి మనం – మన పరిశుబ్రతలో భాగంగా ఇంటింటా ఫీజులు రూ.3000/- సేకరించినందుకు వాలింటీర్ ఇందుమతిని , పింఛన్ల  పంపిణీ  అర్థ రాత్రి నుండే చేపట్టడం పై వాలింటీర్ ఇందు ను  , నరేగా పనులలో అవగాహన  కల్పించి పనుల కల్పించినదుకు వాలింటీర్ కుసుమకు  సంయుక్త కలెక్టర్ అభినంధనలు తెలిపారు. సచివాలయాల పర్యటనలో సందర్శకుల రిజిస్టర్లో సంతృప్తిగా వుందని  జెసి సంతకాలు చేశారు.  సంయుక్త కలెక్టర్ (డి) పర్యటనలో రేణిగుంట ఎంపీడీఓ ఆదిశేషా రెడ్డి, ఇ ఓ పి ఆర్ డి నీలకంటారెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలింటర్లు  పాల్గొన్నారు.