ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేయాలి..


Ens Balu
1
Anantapur
2020-10-09 19:33:58

అనంతపురం జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూమికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను నిర్దేశించిన గడువు లోవు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో HLC,HNSS,PABR,NATIONAL HIGHWAYS, RAILWAYS,APIIC  తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిపై ఆర్డీవోలు, ఇంజనీర్లు, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్లతో కలెక్టర్ సమీక్షించారు..   తొలుత హెచ్ ఎల్ సీ కి సంబంధించి స్టేజ్1 PABR  స్టోరేజ్ సామర్థ్యం పెంపుకు అవసరమైన భూసేకరణపై ఎస్ ఈ రాజశేఖర్, ఎస్డీసీ వర ప్రసాద్ లతో సమీక్షించారు. ఇందుకు సంబంధించి అవసరమైన 1442 ఎకరాలకు నవంబర్  ఏడవ తేదీ లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వాలని గడువు విధించారు.అలాగే  ఫిబ్రవరి 10 వ తేదీ లోపు అవార్డ్ పాస్ చేయాలని ఆదేశించారు.  అక్టోబర్ నెలాఖరు లోపు సర్వే పూర్తి చేయాలని, సర్వే సమయంలోనే జాయింట్ ఇన్స్పెక్షన్, పెగ్ మార్కింగ్ లాంటి ప్రక్రియలను కూడా పూర్తి చేయాలని సర్వే శాఖ ఎడి, ఎస్ ఈ, ఎస్ డి సీ లను ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న 84 కోర్ట్ కేసులు త్వరితగతిన పూర్తి అయ్యి, తీర్పు వచ్చేలా కౌంటర్ ఫైల్ చేయడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే PABR స్టేజి 2 కు సంబంధించి ప్యాకేజ్ 32 లో ఈ నెల 20 లోపు,ప్యాకేజ్ 42 లో ఈ నెలాఖరు లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. జాజికొండ వాగుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న1300  ఎకరాల్లో 500 ఎకరాలకు అక్టోబర్ 10, 500 ఎకరాలకు నవంబర్ 15,మరో 300 ఎకరాలకు నవంబర్ 30 లోపు భూసేకరణ పూర్తి చేయాలని  కలెక్టర్ ఆదేశించారు.    HNSS  ఫేస్ 1, 2 లకు సంబంధించి 1040 ఎకరాల పట్టా భూమి భూసేకరణ ప్రక్రియను డిసెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఎస్ డీసీ రవీంద్ర ను ఆదేశించారు. అలాగే 801 ఎకరాల డీ కేటీ భూముల సేకరణ ను  నవంబర్ 12 లోపు పూర్తి చేసి రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.  447 మంది జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ స్కీం వర్తింపుకు వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రైల్వే, ఏపీఐఐసీ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన నిర్మాణాలకు హిందూపురం,తాడిపత్రి, గుంతకల్, కదిరి పట్టణాల్లో ఈ నెల 20 లోపు భూమిని స్వాధీనం చేయాలని సంబంధిత ఆర్డీవోలను ఆదేశించారు. ఈ నెల 28 వ తేదీన భూసేకరణ పురోగతిపై సమీక్షిస్తామని, అంతలోపు నిర్దేశించిన విధంగా పురోగతి చూపించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ &,రైతు భరోసా) నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ నిషా0తి, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.