అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
2
ఐసిడిఎస్ కార్యాలయం
2020-10-09 20:20:24

విజయనగరం జిల్లా ఐ.టి.డి.ఎ యేతర పరిధిలో ప్రస్తుతము 26  అంగన్వాడీ కార్యకర్తలు, 164 అంగన్వాడీ హెల్పర్లు మరియు 26 మిని అంగన్వాడీ కార్యకర్తlల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సదరు పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. సదరు దరఖాస్తులు తే. 14.10.2020 దీ  నుంచి 20-10-2020 వరకులోగా సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారీ ఐ.సి.డి.యస్ ప్రోజెక్టు  కార్యాలయమునకు నేరుగా గానీ/రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుతో పాటు వారి యొక్క కులము, నివాసము మొదలగు  దృవ పత్రముల నకళ్ళు గెజిటడ్ అధికారిచే అటిస్టేషన్ చేయించి జతపరచాలని అధికారులు సూచిస్తున్నారు.   అంగన్వాడి కార్యకర్త,  అంగన్వాడీ హెల్పరు మరియు మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయు అభ్యర్ధులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండి తే.01.07.2020 దీ నాటికి 21-35 సం,,ల లోపు వయస్సు కలిగి యుండవలెను. అభ్యర్ధులు 10 వ తరగతి ఉత్తీర్ణులై యుండవలెను.   రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు కేటాయించిన కేటగిరీ చెందిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. వికలాంగులకు కేటాయించిన ఖాళీలకు వినికిడి లోపము గల అభ్యర్ధులు హియరింగ్ ఎయిడ్ తో వినగలిగి సంభాషించగలిగి యుండవలెను. శారీరక వికలాంగులు పిల్లల సంరక్షణ చేపట్టగలిగి, పూర్వ ప్రాధమిక విద్య నేర్పించగలిగి యుండవలెను. దృష్టి లోపము గల అభ్యర్ధులు యితరుల సహాయ సహకారము లేకుండా విధులు నిర్వర్తించగలిగి యుండవలెనని అధికారులు సూచిస్తున్నారు.