జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం పండుగ..


Ens Balu
3
Kovvur
2020-10-10 12:45:07

ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందని, రైతులకు ఇంటిముంగిట సేవలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిందని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురు ఎం.పి.డి వో కార్యాలయలో కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాలకు సంభందించిన వ్యవసాయ సలహా మండలి  మొదటి సర్వ సభ్య సమావేశం లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ గా మారిస్తే... దానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామసచివాలయాల ద్వారా సిబ్బందిని నియమించి మరీ రైతులకు మేలు చేస్తోందన్నారు. ఇపుడు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళిక చేయడం ద్వారా సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల సలహా మండలి అధ్యక్షులు పామేర్ల నగేష్ కుమార్,వల్లభని శ్రీహరి,ఉండవల్లి వెంకటేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారులు జగదాంబ,రాంప్రసాద్ తో పాటు పెద్దఎత్తున,రైతులు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.