పోలీసుల సేవలు ప్రశంసనీయం..
Ens Balu
3
విజెఎఫ్ ప్రెస్ క్లబ్
2020-10-10 14:29:49
సమాజ ప్రగతి లో పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివీ సత్యనారాయణ కొనియాడారు. విశాఖలో శనివారం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నేవల్ డాక్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, పోలీస్ అధికారులు పదవీవిరమణ సభలో ఎంపీ ఎంవీవీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 38 ఏళ్ళ పాటు పోలీస్ అధికారులు గా ఎటువంటి రిమార్కులు లేకుండా సేవలు అందించిన సనపల సింహాచలం .ఉమా మహేశ్వర రావు డేవిడ్ కిషోర్ దంపతులను ఎంపి ఎంవీవీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, నిరంతరం సమాజ అభివృద్ధి కోసం పోలీసులు చేస్తున్న కృషి అభినందనీమన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు నిరంతర శ్రామికులు గా ప్రజలు కి అందుబాటులో ఉంటూ సేవలు కొనసాగించారని ఎంపీ అభివర్ణించారు. ఉద్యోగ విరమణ చేసినప్పటికీ వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలు అందించే అవకాశం ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన నేవల్ డాక్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తమ అసోసియేషన్ ద్వారా నిజాయితీ తో సేవలు అందించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులును సత్కరించుకోవడం తమకు దక్కిన అవకాశంగా భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింతగా మరిన్ని సేవలు అందించాలని పదవి విరమణ తర్వాత కూడ వారి వారి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. పోలీస్ లు ,కోవిడ్ లో అందించిన సేవలు నిరుపమాన మన్నారు. ప్రతీ ఒక్కరు సమాజ సేవ లో తమ వంతు భాగస్వామ్యం అందించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. సమన్వయకర్త గా పోలీస్ విభాగానికి చెందిన ఏఎస్ఐ కొత్తపల్లి గోవిందమ్మ వ్యవహరించారు. నేవల్ డాక్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కార్యదర్శి భాస్కర్ రావు, సన్యాసిరావు, కృష్ణారావు, రవి, జీకే ప్రసాద్, నాగార్జునరావు, శ్రీను, పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.