వార్డు సచివాలయ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి..


Ens Balu
1
వీఎంఆర్డీఏ థియేటర్
2020-10-10 16:40:06

ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతీ వ్యక్తికీ అందాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శనివారం VMRDA ఎరీనా చిల్డ్రన్ థియేటర్ లో వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ, సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిపాలన, సంక్షేమం, ప్రతీ పేద ఇంటికి చేరాలని ఉద్వేగంతో వార్డు సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టారన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవారి కోసం వై.ఎస్.ఆర్. చేయూత, జగనన్న తోడు, రైస్ కార్డు, వై.ఎస్.ఆర్. భీమా, జగనన్న విద్యా దీవన, హౌసింగ్ స్కీము, అమ్మ ఒడి, ఆసరా, నేతన్న నేస్తం, పెన్షన్ కానుక వంటి మొత్తం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని, ప్రతీ పధకం అర్హులైన పేదవారికి అందించే బాధ్యత, సంక్షేమ కార్యదర్శులపై ఉందన్నారు. నగర పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం సాగిస్తున్నారని వారు మనల్ని నమ్ముకొని ఉన్నారని, ప్రజలకు హక్కుగా అందవలసిన అన్ని పధకాలు వారికి చేరాలని, వారికి ఆర్ధిక భరోసా కల్పించి ఆర్ధికంగా పైకి తీసుకురావలసిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం, ప్రాజెక్టు డైరెక్టర్(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శులు నిబద్దతతో పనిచేయాలన్న ఆయన ముఖ్యంగా, రైస్ కార్డు, పించన్ మొదలైన అర్హులను గుర్తించాలన్నారు. ప్రజలు పెట్టుకున్న ఆర్జీలు పెండింగులో ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్(యు.సి.డి.) వై. శ్రీనివాస రావుతో పాటూ, ఏ.పి.డి.లు, వార్డు సంక్షేమ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.