శ్రీవారికి కానుకగా బంగారు శఠారి విరాళం..
Ens Balu
2
Tirumala
2020-10-10 17:01:13
తిరుమలలోని శ్రీవారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టిటిడి ఈవో(ఎఫ్ఏసి) ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా క్రుష్ణమూర్తి మాట్లాడుతూ, స్వామివారికి శఠారిని కానుక ఇవ్వడం తమ పూర్వజన్మ సుక్రుతమన్నారు. స్వామివారి పూజలో వినియోగించే పూజా సామాన్లు తయారుచేయించి ఇచ్చే అవకాశం తమకు దక్కడం చాలా ఆనందంగా వుందన్నారు. శ్రీవారి కరుణా కటాక్షాలతో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణ జరగాలని స్వామిని వేడుకున్నట్టు వివరించారు. మహమ్మారి కారణంగా స్వామి చూడటానికి భక్తులు భయపడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణ జరిగితే భక్తులు, ముసలివారు, పిల్లలు కూడా స్వామివారిని తనివితీరా చూసే భాగ్యం కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.