గ్రామంలోనే మెరుగైన పశువైద్య సేవలు..


Ens Balu
3
Padmanabham
2020-10-10 17:12:38

పాడిపరిశ్రమకు ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.  పద్మనాభం మండలం ,రెడ్డిపల్లి గ్రామంలో సుమారు 32 లక్షల వ్యయంతో నిర్మించిన పశు వైద్య శాల భవనాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో పశువైద్యానికి వీలుగా గ్రామసచివాలయంలో వెటర్నలీ సహాయకులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇకపై పశువైద్యానికి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించే పనిలేదన్నారు. పశు వైద్య శాల లో సిబ్బందికి అవసరమైన కంప్యూటర్, ఫర్నిచర్ లాంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధిత శాఖ మంత్రి తో మాట్లాడి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద , బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న దనీ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని వీటిని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా  ప్రభుత్వ సేవలను సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల  ద్వారా ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్, వ్యవసాయ శాఖ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జయ శేఖర్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల లో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  పాల్గొన్నారు.