గణపతి రావుకు నివాళులు అర్పించిన కలెక్టర్..
Ens Balu
3
Veeraghattam
2020-10-10 18:24:26
శ్రీకాకుళం జిల్లా వీరఘాట్టం తహసిల్దార్ గా పనిచేస్తూ అస్వస్తతతో మృతి చెందిన ఎం.గణపతి రావు భౌతిక కాయంపై పుష్ప గుచ్చాలు పెట్టి జిల్లా కలెక్టర్ జె నివాస్ నివాళులు అర్పించారు. శుక్ర వారం మృతి చెందిన గణపతి రావు భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు శనివారం ఉదయం శ్రీకాకుళం నాగావళి తీరాన ఉన్న రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న కైలాస భూమిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ గణపతి రావు ఆత్మకు శాంతి కలగాలన్నారు. గణపతి రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలని, ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. గణపతి రావు విధుల పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తి అన్నారు. జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా రెవెన్యూ శాఖకు అతని మృతి తీరని లోటు అన్నారు.