24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-10-10 18:34:06

విశాఖజిల్లాలో  తీవ్ర అల్పపీడనం కారణంగా రాగల 24 గంటలలో భారీ వర్షాలు పడతాయని, వాతావరణ శాఖ సూచన మేరకు  ముందస్తు చర్యగా జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాలలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా మత్స్యశాఖ అధికారులు అప్రమత్తం గావించాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం . 0891 – 2590102 , 0891- 2590100 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం గావించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాలలో మత్స్యశాఖ అధికారులు , ఎఫ్.డి.ఒ.లు, ఎ.డి.లు. పర్యటించి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జాయింట్ డైరెక్టర్, ఫిషరీస్, ఆ మేరకు తగు చర్యలు చేపట్టాలన్నారు. తీర ప్రాంత మండాలలోని గ్రామ సచివాలయాలలోని మత్స్యశాఖ మరియు పశుసంవర్థక శాఖ అసిస్టెంట్స్ అప్రమత్తంగా వుండాలన్నారు. ఎవరైన సముద్రంలోకి వేటకి వెళ్లివుంటే వారిని సత్వరమే వెనక్కి రప్పించాలని చెప్పారు. వారంతా సురక్షిత ప్రాంతాలలో వుండేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని మత్స్యకారులెవరూ సముద్రంలోకి పోరాదన్నారు. తేది 11.10.20, 12.10.20 లలో పరిస్థితి ఇలాగే కొనసాగుతూ వుంటుందని. జిల్లా అధికారులంతా అందుబాటులో వుండి అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం కలెక్టరు కార్యాలయంలో కంట్రోల్ రూం 24 గంటలు పని చేసేలా తగు చర్యలు చేపట్టాలని డి.ఆర్.ఒ.ని ఆదేశించారు.