APGEAతోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం..


Ens Balu
3
Nellore
2020-10-10 19:07:13

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం మాత్రమే పరిష్కారం చేయగలదని యూనియన్ రాష్ట్ర నాయకులు చొప్పా రవీంద్రబాబు అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో APGEA అధ్వర్యంలో ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షులు బషీర్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులంతా కలసి మెలసి ఒకే కుటుంబంలా ఉండాలన్నారు. ఏ సమస్య వచ్చినా సంఘం రాష్ట్ర నాయకత్వం ద్రుష్టికి తీసుకువస్తే..దానిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం  జిల్లా వ్యాప్తంగా వచ్చిన గ్రామ / వార్డ్ ఉద్యోగులు పలువురు ప్రసంగిస్తూ సచివాలయంలో వారికి ఉన్న సమస్యల గురించి వేదిక దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నింటీని రాష్ట్ర నాయకత్వం పరిష్కరించడానికి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో APGEA జిల్లా అధ్యక్షులు  రమణారెడ్డి, సహాధ్యక్షులు  చేజర్ల సుధాకర్ రావు, కార్యదర్శి  మల్లికార్జున, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెయ్య, కోశాధికారి రాంప్రసాద్,నెల్లూరు సిటీ కార్యదర్శి  నాగరాజు, వెంకటగిరి అధ్యక్షుడు  సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.