శ్రీకాళహస్తిలో ఘనంగి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు..


Ens Balu
4
Srikalahasti
2020-10-11 16:34:56

శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయన్నారు. పెద్దన్నగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, బాలకృష్ణయ్య, సిరాజ్ భాష, వడ్ల తంగం బాలాజీ రెడ్డి, సునీత సింగ్  పగడాల రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.