సత్కారం సేవ భాద్యతను పెంచింది..


Ens Balu
2
Rajahmundry
2020-10-11 17:48:42

ప్రపంచ విపత్తు కరోనా సమయంలో తమకు తోచిన సహాయం చేసిన ప్రతీఒక్కరూ దేవుడితో సమానమని హాసం క్లబ్ నేతలు ఎంవీ అప్పారావు అన్నారు. ఆదివారం రాజమండ్రిలోని ముస్లిం సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కరోనా సమయంలో తనవంతు బాధ్యతగా సేవలు అందించిన ప్రముఖ నఖ చిత్రకారుడు, సేవకుడు రవి పరసను ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత రవి పరస మాట్లాడుతూ,    ఎవరికోసమో కాకుండా..మనస్సు కు సంతోషాన్నిచ్చి, పలువురి ఉపయోగించే ఏపనైనా మనసుకి ఎంతో శ్వాంతన కలుగజేస్తుందన్నారు. తనకున్నదానిలో కరోనా సమయంలో సహాయం చేసే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు. ఇలాంటి సన్మాన కార్యక్రమాలు పేరుకు కాకుండా రానున్న రోజుల్లో సేవలు మరింతగా చేసేలా బాధ్యతను పెంచుతాయని అన్నారు. తనను, తన సేవలను గుర్తించి ఈ సత్కారాన్ని చేసినందుకు ఆయన హాసం క్లబ్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. 25 మంది ప్రైవేటు స్కూలు టీచర్లకు చేసిన సహాయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.  కార్యక్రమంలో సురేఖ, డివి.హనుమంతురావు, మోహ్మద్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.