రెండు రోజులు తుఫాను ఉంది జాగ్రత్త..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-11 19:38:54

 బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి తెలిపారు. వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీస్తాయని ఆయన తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆయన కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసామని చెప్పారు. తీరప్రాంత మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.