నాణ్యమైన ఉచిత విద్య ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
5
విశాఖపట్నం
2020-10-12 14:16:56

నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధానన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావు అన్నారు. సోమవారం జి. వి. ఎం. సి. పరిధిలోని పెద వాల్తేరు  కె. డి. పి. ఎం. ఉన్నత  పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో  మంత్రి  పాల్గొని  విద్యార్థిని, విద్యార్థులకు  కిట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా తయారు చేశామని వివరించారు. విద్యార్ధులకు ఉన్నతమైన విద్య అందించడానికి సీఎం వైఎస్ జగన్ క్రుతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం విద్యను అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేసి, వారిని ప్రయోజకులుగా తయారు చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పమన్నారు. ప్రజలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి, మంచి ప్రయోజకులుగా మలుచకోవాలన్నారు. అన్ని వసతులు వినియోగించుకొని ఇంగ్లీషు మీడియం విద్యను అభ్యసించాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశాఖ మహానగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.