ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ సత్వరం జరగాలి..


Ens Balu
5
కలెక్టరేట్
2020-10-12 18:59:13

చిత్తూరు జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సచివాలయ సర్వేయర్ వారి పరిధిలోని వి.ఆర్.ఓ., సహకారంతో రోజుకొక్క సర్వే వంతున నిర్దేసించి  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యలయం నుండి డివిజన్ స్థాయి అధికారులతో, తహసీల్దార్లతో , సచివాలయ సర్వేయర్లతో లాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ , మీసేవ , సచివాలయ ధరఖాస్తుల పెండింగ్ , ఇంటిపట్టాల కోసం లేఔట్స్ , నవశకం కార్డుల పంపిణీ పై జిల్లా కలెక్టర్ వీడియోకాన్ఫెరెన్స్ నిర్వహించగా ఆర్డీఓ కనకనరసా రెడ్డి పాల్గొన్నారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సర్వే నెంబర్ పరిశీలించి లాండ్ రికార్డ్స్ ఖచ్చితంగా తయారు కావాలని అందుకోసం సచివాలయం సర్వేయర్లు తమ పరిధిలోని సర్వే నెంబర్లను గుర్తించి రోజుకొక్క సర్వేపూర్తిచేయాలని అన్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక  ప్రోఫార్మా పంపించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగపరిష్కారం , డాక్యుమెంట్ల పరిశీలన, వున్న లాండ్ వివరాలు , చనిపోయివుంటే  గ్రామసభలో గుర్తించి నామినీలకు హక్కు కల్పించడం వంటివి గుర్తించి సరిచేయాల్సి వుంటుందని అన్నారు. రేణిగుంట – నాయుడుపేట , కడప-బెంగళూరు బ్రాడ్ గేజ్ , జాతీయా రహదారుల భూసేకరణ పెండింగ్ అంశాలు దృష్టి పెట్టి పూర్తిచేయాలని సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ఇక ఇంటిపట్టాల విషయంలో అదనంగా  మరో 7 వేల వరకు అర్హతగల  జాబితా వుందని, వీరికూడా లేఔట్ సిద్దం కావాలని అందుకు కావలసిన భూసేకరణ ప్రతిపాధనలు పంపాలని అన్నారు. ఇంటి పట్టాలకు కోసం చిత్తూరు డివిజన్ లో 141 లేఔట్లకు గానూ 41 పెండింగ్ , మదనపల్లి 545 లేఔట్లకు గానూ 120 , తిరుపతి 281 లేఔట్లకు గానూ 22 ఆన్ లైన్ నమోదు జరగలేదని, పెండింగ్ వుంటే త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అంగన్ వాడి, సచివాలయాలకు, రైతు బారోసా కేంద్రాలకు పెండింగ్ లో వున్న  సైట్ లను త్వరగా క్లియర్ చేసి అందించాలని అన్నారు.  ఏపీఐఐసీ లాండ్స్, జాతీయ రహదారులలాండ్స్ కూడా నమోదు కావాలని అన్నారు.  మీసేవా, సచివాలయ ధరఖాస్తుల పెండింగ్ పై దృష్టి  పెట్టి పరిష్కరించాలని, మీ సేవా కన్నా, సచివాలయాలల్లో  ధరఖాస్తుల నమోదు పెరగాలని  అన్నారు. నవశకం రేషన్ కార్డుల పరిష్కారం 94.9 శాతం , స్ప్లిట్ కార్డుల పరిష్కారం 95.3 శాతంగా ముందున్నా పంపిణీలో ఆలస్యం వుందని రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.           చిత్తూరు నుండి జెసి మార్కండేయులు , డిఆర్ఓ మురళి లాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ పై , సర్వే చేపట్టాలసిన  విధానం పై తహసీల్దార్లకు సూచించగా, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు ఆర్డీఓ రేణుక పాల్గొనగా, అన్నిమండల కార్యాలయాల నుండి తగసిల్దార్లు, సచివాలయ వి ఆర్ ఓ లు, సర్వేయర్లు పాల్గొన్నారు.