బాలల సంరక్షణకు సత్వర చర్యలు..
Ens Balu
4
కలెక్టరేట్
2020-10-12 19:04:50
బాలల హక్కుల పై అందిన ఫిర్యాదులకు సత్వరమే స్పందించాలని సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఫిర్యాదుల పై ఆయన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సోమవారం జే.సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న కేసు లను సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి శాఖలో బాలల హక్కుల పై వచ్చే ఫిర్యాదులను, వినతులను స్వీకరించి చర్యలు తీసుకొనుటకు ఒక ఉద్యోగిని ఇంచార్జ్ గా డిసిగ్నేట్ చెయ్యాలన్నారు. ప్రతి ఫిర్యాదుకు తక్షణమే స్పందించి జవాబు రాసి ఢిల్లి లోని ఉన్నతాధికారులకు పంపుతూ ప్రతిని జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ లకు ఐ.సి.డి.ఎస్. పి.డి కు పంపాలని సూచించారు. ఆగష్టు 8 న బాలల హక్కుల కమిషన్ నిర్వహించిన బెంచ్ వద్ద 134 ఫిర్యాదులు విచారణకు వచ్చాయని, వాటిలో 123 వినతులకు యాక్షన్ టేకెన్ రి పోర్ట్ ను పంపడం జరిగిందన్నారు. మిగిలినవి కూడా ఆయా శాఖలు వెంటనే పంపాలని అన్నారు. విద్యా శాఖకు సంబంధించి టాయిలెట్స్, తాగు నీరు, ప్రహరి గోడలు, క్రీడా పరికరాల కోసం ఎక్కువగా వినతులు అందాయని, వాటిని నాడు- నేడు క్రింద పరిష్కరించడం జరుగుతోందని జిల్లా విద్యా శాఖా దికారి జి. నాగమణి తెలిపారు. విద్యా సంస్థల సమీపంగా మద్యం దుకాణాలు ఉన్నాయనే ఫిర్యాదు అందిందని, రాష్ట్ర నిబంధనలను అనుసరించి వాటిని తనిఖీ చేసి తొలగిస్తామని ఎక్సయిజ్ అధికారులు తెలిపారు. ఈ సమావేశం లో ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి, మున్సిపల్ కమీషనర్ వర్మ, జిల్లా సరఫరా అధికారి పాపా రావు, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి లక్ష్మి, ఆర్టిసి , పోలీస్, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.