8 మందికి కారుణ్య నియామకాలు..
Ens Balu
4
కలెక్టరేట్
2020-10-12 19:50:33
విజయనగరం జిల్లాలో 8 మందికి కారుణ్య నియామకాలు జరిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చి, వారి కుటుంబాలకు ఆసరా కల్పించారు. వారి వారసుల విద్యార్హతలను బట్టి, వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల ఆధారంగా పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు సంబంధించి తన ఛాంబర్‌లో అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఖాళీలను బట్టి, వారు ఏ శాఖలో చేరుతారో, ఏ ప్రాంతంలో విధులు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారో తెలుసుకున్నారు. అనంతరం వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. బి.గౌరీకుమారిని ఆఫీస్ సబార్డినేట్‌గా, ఎం.చైతన్యవర్మ, యందవ అజయ్‌కుమార్, తాడంగి పృధ్వి, పిజి సాయిధీరజ్, సోము మౌనిక, సవరపు రాజ్‌కుమార్, కె.సుధీర్‌బాబులను జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.